: జింబాబ్వే అధ్యక్షుడి పుట్టిన రోజునాడు ఆ దేశం అంతటా సెలవు ప్రకటించిన ప్రభుత్వం!


జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే తమ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి (1980) ఇప్పటివరకు ఆ కుర్చీని వ‌ద‌ల‌లేదు. ఇప్పుడు ఆయ‌న వ‌య‌సు 93 ఏళ్లు. అయిన‌ప్ప‌టికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తాను పోటీ చేస్తాన‌ని, మ‌ళ్లీ అధ్యక్షుడి కుర్చీలో కూర్చుంటాన‌ని తెగేసి చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య సమ‌స్య‌ల‌తోనూ బాధ‌ప‌డుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆయ‌న‌ ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌టన చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా దేశమంతటా సెలవుగా ప్రకటిస్తున్న‌ట్లు తెలిపింది. అంతేకాదు ఆ రోజును నేషనల్‌ యూత్ డేగా జ‌ర‌పాల‌ని పేర్కొంది. రాబర్ట్‌ ముగాబే జీవితాన్ని నేటి యువ‌త ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని సూచించింది. త‌మ‌ దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టుకు ముగాబే పేరు పెట్టాలని నిర్ణ‌యం తీసుకుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జింబాబ్వేలో ప్రభుత్వ ఆదాయంలో 90 శాతం ఉద్యోగులకు జీతాలు చెల్లించ‌డానికే అయిపోతోంది. మరోపక్క, వచ్చే ఎన్నికల్లో ఆయ‌న‌ను ఎలాగైనా ఓడించాల‌ని అక్క‌డి ప్రతిపక్షాలన్నీ ఏక‌మ‌వుతున్నాయి. 

  • Loading...

More Telugu News