: 5-10 ఏళ్లు అధికారంలో ఉండేందుకు మేం రాలేదు.. కనీసం 50 సంవత్సరాలైనా అధికారంలో ఉంటాం: అమిత్ షా
మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో భేటీ అయి పలు సూచనలు చేశారు. బీజేపీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. దేశంలో బీజేపీ 5-10 ఏళ్లు అధికారంలో ఉండేందుకు రాలేదని, కనీసం 50 సంవత్సరాలైనా ఉండాలని అన్నారు. భారత్‌లో మార్పులు తీసుకురావాలనే ధ్యేయంతో పనిచేయాలని అన్నారు. కేంద్రంలో బీజేపీకి 330 మంది ఎంపీలు ఉన్నారని, రాష్ట్రాల్లో 1387 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. తమ పార్టీ శిఖరాగ్ర స్థానంలో ఉందని తెలిపారు.