: ముఖానికి చున్నీ కప్పుకుని.. అర్ధరాత్రి స్కూటర్‌పై తిరుగుతూ.. మహిళల భద్రతను పర్యవేక్షిస్తోన్న కిరణ్ బేడీని చూడండి!
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నిన్న అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై తిరుగుతూ ప్రధాన రహదారుల్లో మహిళలకు భద్రత ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. తనను ఎవ్వరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి చున్నీ కూడా కప్పుకున్నారు. ఆ సమయంలో తన వెంట భద్రతా బలగాలను కూడా తీసుకెళ్లలేదు. ఆమె పర్యటిస్తుండగా తీసిన వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఆమె ధైర్యాన్ని, మహిళల భద్రత కోసం ఆమె చేస్తోన్న కృషిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ద్విచక్రవాహనంపై చేసిన తన పర్యటన గురించి ట్విట్టర్ ద్వారా తెలుపుతూ పుదుచ్చేరిలో రాత్రివేళ బయట ఉండటం సురక్షితమేనని సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ భద్రతను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రజలు తమకు ఏదైనా అవసరమైతే 100కు ఫోన్ చేయవచ్చని సూచించారు.