: కేసీఆర్ కు అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 పురస్కారం!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అరుదైన గౌరవం లభించింది. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ కేసీఆర్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ వ్యవసాయ నాయకత్వ సదస్సులో కేసీఆర్ కు భారత ఆహార, వ్యవసాయ మండలి ఈ అవార్డును అందజేయనుంది. గ్రామీణాభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తులకు 2008 నుంచి భారత ఆహార, వ్యవసాయ మండలి ఈ అవార్డును అందజేస్తోంది.