: రోజా ఎవరో నాకు తెలియదు.. సారీ!: మీడియాతో హాస్య నటుడు వేణుమాధవ్


వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటి రోజా ఎవరో తనకు తెలియదంటూ హాస్యనటుడు వేణుమాధవ్ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున హాస్యనటుడు వేణుమాధవ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ‘రోజాకు కౌంటర్ ఇచ్చేందుకే మిమ్మల్ని టీడీపీ అధిష్ఠానం రంగంలో దింపిందనే కామెంట్స్ వస్తున్నాయి?’ అని ప్రశ్నించగా.. ‘ఆమె ఎవరో నాకు తెలియదు.. సారీ’ అని వేణుమాధవ్ సమాధానమిచ్చాడు.

‘నేను నా డిగ్రీ చదువు పూర్తయిన తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర, అలాగే, టీడీపీ ఆఫీసులో పని చేసేవాడిని. కాబట్టి, టీడీపీతో, నందమూరి కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. భూమా నాగిరెడ్డి కుటుంబంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగానే ఈ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను’ అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News