: నంద్యాలలో టీడీపీ గెలుపు తథ్యం: పరిటాల సునీత


నంద్యాలలో తెలుగుదేశం గెలుపు తథ్యమని ఏపీ మంత్రి పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ఎవరెన్ని మాటలు చెప్పినా, మభ్యపెట్టినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటెయ్యాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఎన్నడూ లేని విధంగా నంద్యాలలో అభివృద్ధి జరిగిందని, ప్రతిపక్ష నేత జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎం కాలేడని అన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని, హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని సునీత హితవు పలికారు.

  • Loading...

More Telugu News