: అధికారం మాది.. కాదు మాదే


బీజేపీ అవినీతి పాలనతో కర్ణాటక ప్రజలు విసిగి పోయారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కే పట్టం కడతారని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ విశ్వాసం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఈ ఉదయం ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు మల్లేశ్వరంలోని పాఠశాలలో ఓటేసిన వెంకయ్యనాయుడు ప్రజలు మరోసారి బీజేపీకి అధికారం అప్పగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమవైపు నుంచి కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని, మొదట్లో కొంత వ్యతిరేకత ఉన్నా ప్రస్తుత వాతావరణం సానుకూలంగా ఉందన్నారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద జోషి కూడా భారీ మెజారిటీతో మరోసారి తాము అధికారాన్ని కైవసం చేసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News