: నేను ఇన్నేళ్లు బతకడానికి కారణం విస్కీయే!: 107 ఏళ్ల బామ్మగారి ఉవాచ
తాను ఇన్నేళ్లు జీవించి ఉండగలగడానికి కారణం రోజూ ఒక గ్లాసు విస్కీ తాగడమేనని లండన్‌కు చెందిన 107 ఏళ్ల బామ్మ కే ట్రావిస్ అంది. ఇటీవలే తన 107వ పుట్టిన రోజు జరుపుకున్న ఆమె ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటుంది. స్వయంగా వంట చేసుకోవడం, తనకిష్టమైన చేపల కూర వండుకోవడం వంటి పనులు చేస్తుంది. ఈ వయసులో కూడా ఎలాంటి రుగ్మతలు లేకుండా, ఇంత ఉత్సాహంగా బలంగా ఉండటానికి కారణం తనకిష్టమైన ఫేమస్ గ్రౌస్ స్కాచ్ విస్కీయేనని కే చెబుతోంది.
తన తల్లి ఆల్కహాల్‌కి అలవాటు పడలేదని, కాకపోతే గత పదిహేనేళ్లుగా రోజూ ఒక గ్లాసు విస్కీ తాగుతుందని ఆమె కుమారుడు జాన్ ట్రావిస్ తెలిపాడు.