: ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో సీటు కొట్టిన మ‌లాలా!


పాకిస్థాన్‌కు చెందిన నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత మ‌లాలా యూసుఫ్ జాయ్ యూకేలోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకోనున్నారు. ఈ విష‌యాన్ని ఆమె ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. యూనివ‌ర్సిటీలో తనకు సీటు కేటాయిస్తూ ఆక్స్‌ఫ‌ర్డ్ వారు పంపిన మెసేజ్‌ను ఆమె షేర్ చేశారు. అక్క‌డ ఆమె ఫిలాస‌ఫీ, రాజ‌కీయాలు, ఆర్థిక శాస్త్రాల‌ను అభ్య‌సించ‌నున్నారు. `ఆక్స్‌ఫ‌ర్డ్ వెళ్ల‌డానికి చాలా ఆత్రుతగా ఉన్నాను` అంటూ మ‌లాలా ట్వీట్ చేశారు. పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని బెన‌జీర్ భుట్టో, మ‌య‌న్మార్ నాయ‌కురాలు ఆంగ్ సాన్ సూకీ, బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని డేవిడ్ కేమెరూన్‌లు కూడా ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలోనే చ‌దువుకున్నారు.

  • Loading...

More Telugu News