: ఉలవచారు రెస్టారెంట్ లో సందడి చేసిన ఎంపీ కవిత, హీరో రామ్ చరణ్!


ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు రకరకాల వ్యాపారాల్లోకి అడుగు పెట్టారు. తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో 'ఉలవచారు' పేరుతో రెస్టారెంట్ ను ప్రారంభించాడు. వాస్తవానికి సొంతంగానే రెస్టారెంట్ ను ప్రారంభించాలని ఆయన భావించినప్పటికీ... చివరకు హైదరాబాద్ లో ఎంతో పాప్యులర్ అయిన ఉలవచారు రెస్టారెంట్ ఫ్రాంఛైజీని తీసుకున్నాడు. ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎంపీ కవిత, హీరో రామ్ చరణ్ లు విచ్చేశారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డికి వీరు శుభాకాంక్షలు తెలిపారు. 

  • Loading...

More Telugu News