: 'బాబూ మొషాయ్..' యూనిట్ కి గుడ్ న్యూస్... ఆ 40 సీన్లు ఉంచేందుకు సెన్సార్ ఓకే!
త్వరలో విడుదలకు సిద్ధమైన 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' చిత్ర యూనిట్ కు సెన్సార్ బోర్డు ఊరటనిచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు మాజీ చైర్మన్ పంకజ్ నిహ్లానీ, ఏకంగా 48 కట్స్ చెప్పిన సంగతి తెలిసిందే. చిత్రంలో శృంగారం, హింస పాళ్లు చాలా ఎక్కువని ఆయన ఆరోపించారు కూడా. దీంతో చిత్రం కథాంశమే దెబ్బతిందని హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఆరోపించారు. చిత్రాన్ని నాశనం చేసేలా కట్స్ ఉన్నాయని ఆరోపిస్తూ, నిర్మాతలు అపిలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఇక చిత్రాన్ని మరోమారు చూసిన ట్రైబ్యునల్ తొలుత చెప్పిన 48 కట్స్ ను 8కి తగ్గించారు. దీంతో ఆనందంలో మునిగిపోయిన నిర్మాతలు, తాజాగా చిత్రంలోని మరో సాంగ్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.