: రంజాన్ పేరిట రోడ్లపై నమాజులు వద్దు: యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు


ముస్లింలు లక్ష్యంగా పలు విధానాలను ప్రకటిస్తున్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరొక వివాదాస్పద సూచన చేశారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు రోడ్లపైకి వచ్చి నమాజ్‌ చేయడం సరి కాదని ఆయన అన్నారు. యూపీ పోలీస్ స్టేషన్లలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోవడం ఆపేయాలని తాను కోరలేనని అన్నారు. కృష్ణాష్టమి వేడుకలను గత ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదని చెప్పారు. ఈ వేడుకను ఇకపై అంగరంగవైభవంగా జరుపుకుందామని ఆయన పిలుపునిచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా దేశంలో ప్రతి ఒక్కరూ తమ వేడుకలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. 

  • Loading...

More Telugu News