: ఎక్సర్‌సైజ్ కూడా ఇంత క్యూట్‌గా చేస్తారా?... సమంత వీడియోకు నెటిజన్ల కామెంట్...మీరూ చూడండి!
సాధారణంగా జిమ్‌లో కసరత్తులు చేసేటప్పుడు సినీతారలు బాగా కష్టపడుతుంటారు. కానీ సమంత ఎక్సర్‌సైజ్ వీడియో అందుకు భిన్నంగా ఉంది. దీంతో `ఎక్సర్‌సైజ్ కూడా ఇంత క్యూట్ గా చేస్తారా?` అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. `నేను చేయగలను లేదా చేయలేకపోవచ్చు` అంటూ తాను జిమ్‌లో బాల్ ప్లాంక్స్ చేస్తున్న వీడియోను సమంత పోస్ట్ చేసింది. వీడియోలో ఏడు ప్లాంక్స్ వరకు బాగానే చేసింది. తర్వాత తాను నవ్విన ఒక్క చిన్న నవ్వుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. దీంతో ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా చూడండి.