: జయంతిని వర్ధంతి అన్న మంత్రి అచ్చెన్నాయుడు... 'లోకేశ్ సాహచర్యమే'నని నవ్వులు పూయించిన అచ్చెన్న!


దివంగత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 108వ జయంతి వేడుకలు జరుగుతున్న వేళ, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, జయంతిని వర్థంతిగా సంబోధించి, ఆపై లోకేశ్ సాహచర్యంతోనే తనకూ అలాగే వచ్చిందని చెప్పి అక్కడున్న వారిని నవ్వించారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో లచ్చన్న జయంతి వేడుకలు జరిగిన వేళ ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ, గౌతు లచ్చన్న వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తుండటం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. వెంటనే పక్కనున్న వారు తప్పును సవరించడంతో, తన వ్యాఖ్యలను సరిచేసుకున్న ఆయన, తప్పును లోకేశ్ పై నెట్టేశారు. గతంలో లోకేష్ బీఆర్ అంబేద్కర్ జయంతిని వర్థంతిగా పేర్కొన్నారని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News