: అపార్టుమెంట్ లో నుంచి కిందపడి ఎయిర్ హోస్టెస్ దుర్మరణం!
ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ హోస్టెస్ క్లారా ఖోంగ్ షిట్ (22) కోల్ కతాలోని అపార్టుమెంట్ పై నుంచి కింద పడి దుర్మరణం చెందింది. అపార్టుమెంట్ లోని నాల్గో ఫ్లోర్ లోని ఓ ప్లాట్ లో నివసిస్తున్న ఆమె నిన్న అర్ధరాత్రి దుర్మరణం చెందినట్టు పోలీసులు తెలిపారు. ఆమె నివసిస్తున్న ప్లాట్ లోని స్లైడింగ్ విండో నుంచి కిందకు పడిపోయిందని, అయితే, ఈ సంఘటన అనుకోకుండా జరిగిందా? లేక ఆత్మహత్య చేసుకుందా? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. తన ఇద్దరు స్నేహితులలో ఒకరి బర్త్ డే పార్టీ క్లారా ప్లాట్ లో జరిగిందని, ఈ సందర్భంలోనే ఈ విషాద సంఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ రోజు ఉదయం క్లారా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగిందని చెప్పారు.