: భారత భద్రతా బలగాల చేతిలో లష్కరే తొయిబా కమాండర్ అయూబ్ లెల్హరి హతం
జమ్ముకశ్మీర్‌లో భారత భద్రతా బలగాలు చేస్తోన్న ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం పుల్వామా జిల్లాలోని బందెర్ పురా కక్పోరాలో ఉగ్రవాదులు ఉన్నారని గుర్తించిన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు కూడా కాల్పులకు తెగబడుతున్నారు. ఎదురు కాల్పుల్లో భారత భద్రతా బలగాల చేతిలో లష్కరే తొయిబా కమాండర్ అయూబ్ లెల్హరి హతమయ్యాడు. కాల్పుల్లో ఓ జవానుకు కూడా గాయాలయినట్లు సమాచారం. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.