: నంద్యాలలో ఎన్నికల సర్వేలు నిర్వహిస్తే చర్యలు: రిటర్నింగ్ అధికారి


క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో ఆ నియోజ‌క వ‌ర్గంలో ఎన్నిక‌ల స‌ర్వేల‌ను నిషేధిస్తూ ఈ రోజు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, ఎన్జీవోలు, ఇత‌రులు ఎవ‌ర‌యినా స‌రే స‌ర్వేలు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు. త‌మ ఆదేశాలు ప‌క్క‌న‌బెట్టి స‌ర్వేలు నిర్వ‌హిస్తే ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న అన్నారు. నంద్యాల‌లో ఎన్నిక‌లు పూర్తయ్యే వ‌ర‌కు ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌ని వివ‌రించారు. భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన‌ నంద్యాల అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గంలో ఈ నెల 23న ఉపఎన్నిక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. 

  • Loading...

More Telugu News