: 19న నంద్యాలలో సీఎం చంద్రబాబు రోడ్ షో
ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడి పర్యటన ఖరారైంది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఈ నెల 19వ తేదీన నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం. 20వ తేదీ మధ్యాహ్నం వరకూ అక్కడే ఉంటారని, పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారని సమాచారం. కాగా, నంద్యాలలో ఈ రోజు నిర్వహిస్తున్న రోడ్ షోలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఆ రోడ్ షో ఇంకా కొనసాగుతోంది.