: ‘బెంగళూరులో రూ.10కే భోజ‌నం’ తిన్న రాహుల్ గాంధీ, సిద్ధ‌రామ‌య్య!


ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామయ్య 'రూ.10 కే భోజనం' పథకంలోని భోజనాన్ని రుచి చూశారు. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం బెంగ‌ళూరులో ప్రారంభించిన ఇందిరా క్యాంటీన్ ప‌థ‌కం ఈ రోజు రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభ‌మైంది. ఈ ప‌థ‌కం ద్వారా బ్రేక్‌ఫాస్ట్‌ను రూ.5కు, భోజ‌నాన్ని రూ.10కే అందిస్తున్నారు. ఈ సంద‌ర్భంగానే వారు త‌మ కార్య‌కర్త‌ల‌తో క‌లిసి భోజ‌నం చేశారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... బెంగుళూరులో ఉన్న ప్ర‌తి పేద వ్య‌క్తికి అన్నం పెట్టాల‌న్నదే ఈ ప‌థ‌కం ఉద్దేశ‌మ‌ని అన్నారు. ఖాళీ క‌డుపుతో ఎవ్వ‌రూ ఉండ‌కూడ‌ద‌ని అన్నారు. నాణ్య‌మైన ఆహారాన్ని ఇందిరా క్యాంటీన్ ద్వారా అతి త‌క్కువ ధ‌ర‌కే అందిస్తామ‌ని తెలిపారు. ఈ ప‌థ‌కాన్ని క‌ర్ణాట‌క‌లోని ఇత‌ర న‌గ‌రాల్లోనూ విస్త‌రించ‌నున్నట్లు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News