: నడి రోడ్డుపై హాలీవుడ్ నటిపై కత్తెరలతో దాడి!


లండన్‌ లో పట్టపగలు, నడిరోడ్డుపై హాలీవుడ్ నటిపై దాడి జరిగింది. లండన్ లోని యూస్టన్‌ స్టేషన్‌ వద్ద కేర్‌ టేకర్‌ తో పాటు వీల్ ఛైర్ లో వేచిచూస్తున్న లిజ్ కర్ (45)పై దుండగుడు(20) దాడి చేశాడు. 'సిజర్ హ్యాండ్స్' సినిమాలోలా రెండు చేతులతో కత్తెరలను పట్టుకుని ఒక్కసారిగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఆమె తలపై కత్తెరలతో పలుమార్లు పొడిచాడు. దీంతో ఆమె తల మొత్తం రక్తసిక్తమైంది. గాయాలపాలైన ఆమెను స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దాడికిపాల్పడి పారిపోతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి జరిగిన తరువాత ఎడ్వర్డ్స్ సిజర్ హ్యాండ్స్ (ఆమె నటించిన సినిమాలో పాత్ర) తనపై దాడి చేసినట్టుందని ఆమె పేర్కొన్నారని ఆమె స్నేహితులు తెలిపారు. కాగా ప్రస్తుతం ఆమె బీబీసీ చానెల్ లో ప్రసారమవుతున్న క్రైమ్ డ్రామా సిరీస్ లో నటిస్తున్నారు. 

  • Loading...

More Telugu News