: భార‌త రాజ్యాంగం గొప్ప‌త‌నానికి వాళ్లే నిద‌ర్శ‌నం: సీజేఐ జ‌స్టిస్ ఖేహ‌ర్‌


దేశంలో అత్యున్న‌త ప‌ద‌వులైన రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి, ప్రధానమంత్రి ప‌ద‌వుల‌ను అలంకరించిన రామ్‌నాథ్ కోవింద్‌, వెంక‌య్య‌నాయుడు, నరేంద్ర మోదీలు భార‌త రాజ్యాంగ గొప్ప‌త‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని సీజేఐ జ‌స్టిస్ ఖేహ‌ర్ కొనియాడారు. స్వాతంత్ర్య‌దినోత్స‌వం సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న జెండా ఆవిష్క‌రించి, ప్ర‌సంగించారు. ద‌ళిత వ‌ర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌, రైతు బిడ్డ వెంక‌య్య నాయుడు, చాయ్ వాలాగా ప‌నిచేసిన మోదీ దేశంలో అత్యున్న‌త ప‌ద‌వులను అధిష్టించి భార‌త రాజ్యాంగం కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కు అతీతంగా ప‌నిచేస్తుంద‌ని నిరూపించార‌ని ఆయ‌న అన్నారు.

తాను ఈ దేశంలో జ‌న్మించ‌న‌ప్ప‌టికీ, పౌరసత్వం వచ్చాక‌ అందరితోపాటు సమానంగా అవకాశాలను అందిపుచ్చుకున్నానని, ఒక‌రు ఎక్కువ, ఒక‌రు త‌క్కువ అని కాకుండా భార‌త రాజ్యాంగం త‌న‌కు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగే అవ‌కాశం క‌ల్పించింద‌ని ఆయ‌న‌ తన అనుభవాలను చెప్పుకొచ్చారు. జస్టిస్‌ ఖేహర్‌ కెన్యాలో జన్మించారు. ఆయన పూర్వీకులు బ్రిటీష్‌ పాలనలో భారత్‌ నుంచి కెన్యాకు వలస వెళ్లిపోయారు. స్వాతంత్ర్యం అనంతరం తిరిగి స్వదేశానికి వచ్చేశారు.
 

  • Loading...

More Telugu News