: 250 కోట్ల వజ్రం కోసం రెడ్ కార్నర్ నోటిసు జారీ చేసిన ఇంటర్ పోల్
250 కోట్ల రూపాయల విలువైన పింక్ వజ్రం కేసులో భారత సంతతికి చెందిన నలుగురు ఆఫ్రికన్ వ్యాపారులకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం భారత్ తో సన్నిహిత సంబంధాలు, ఒప్పందాలు ఉన్న దేశాల్లో నోటీసులో పేర్కొన్న వ్యక్తులు ఉంటే వారిని భారత్ కు అప్పగించాల్సి ఉంటుంది. 250 కోట్ల రూపాయల విలువైన పింక్ వజ్రం చోరీకి గురైంది. ఈ కేసును ఛేదించడం ప్రపంచ దేశాల పోలీసులకు సవాల్ గా మారింది. భారత సంతతికి చెందిన ఆఫ్రికన్లు జునైద్ మోతీ, అబ్బాస్ అబూబకర్ మోతీ, అష్రఫ్ కాకా, సలీం బొబట్ లు ఈ కేసులో నిందితులని పేర్కొంటూ రెడ్ కార్నర్ నోటీసులను ఇంటర్ పోల్ జారీ చేసినట్టు స్పష్టం చేసింది. అయితే ఈ నోటీసులను నిలిపివేయాలంటూ ప్రిటోరియా హైకోర్టును నిందితులు కోరారు.