: ఈ దెబ్బతో మోదీ ఔట్ అని చాలామంది భావించారు.. : ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ!


పెద్ద నోట్ల రద్దుపై వస్తున్న విమర్శలను ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ కొట్టిపడేశారు. నోట్ల రద్దుతో మూడు లక్షల కోట్ల రూపాయల నల్లధనం వెలుగుచూసిందన్నారు.  ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ నోట్లు రద్దును ప్రకటించిన వెంటనే ప్రపంచం ఆశ్చర్యపోయిందన్నారు. చాలామంది ఈ దెబ్బతో మోదీ పని అవుట్ అని అనుకున్నారని అన్నారు. అయితే 125 కోట్ల మంది ప్రజలు సహనాన్ని, తమ విధేయతను ప్రదర్శించారని మోదీ కొనియాడారు.

నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన రూ.1.75 లక్షల కోట్లతోపాటు 18 లక్షల మంది ఆదాయ వివరాలపై అనుమానాలు ఉన్నట్టు తెలిపారు. ఇవన్నీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు. 18 లక్షల మందిలో 4.5 లక్షల మంది తమ తప్పులను సవరించుకునేందుకు ముందుకు వచ్చినట్టు వివరించారు. బడాబాబుల ఇళ్లలో మూలుగుతున్న నల్లధనాన్ని నోట్ల రద్దు ద్వారా వెలికితీయడంలో విజయం సాధించామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News