: హైదరాబాదులోని టిక్కీ షాక్ పబ్ లో కస్టమర్ పై బౌన్సర్ల దాడి!


హైదరాబాదులోని పబ్ లో రేగిన వివాదం ఒక వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్థితికి దారితీసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదు, జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36లో గల టిక్కీ షాక్ పబ్ లో బౌన్సర్లు వినియోగదారుడిపై మూకుమ్మడి దాడికి దిగారు. ఈ దాడిలో సంతోష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు. 20 మంది బౌన్సర్లు తనను కొట్టారని, అలా కొట్టడానికి కారణాలు తెలియడం లేదని ఆయన అన్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పాడు. కాగా, పబ్ ల వద్ద బౌన్సర్ల ఆగడాలు శ్రుతి మించుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. 

  • Loading...

More Telugu News