: చందు క్షేమం... డీహైడ్రేషన్ తో బాధపడుతున్నాడు... ఎలాంటి గాయాలు కాలేదు: వైద్యులు


చందు క్షేమంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మడివరంలో బోరుబావిలో పడిన రెండేళ్ల చంద్రశేఖర్ ను విజయవంతంగా బయటకు తీసిన సంగతి తెలిసిందే. చందూకు సంఘటనా స్థలంలోనే ప్రాధమిక చికిత్స అందించిన వైద్యులు, అబ్జర్వేషన్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యపరీక్షలన్నీ చేశారు. బాబుకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. క్షేమంగా ఉన్నాడని, సుమారు 11 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో డీహైడ్రేషన్ తో బాధపడుతున్నాడని అన్నారు. అంతకు మించి ఎలాంటి గాయాలు లేవని అన్నారు. 

  • Loading...

More Telugu News