: తన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన స్టైలిష్ స్టార్!
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాడు. సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో నిర్మాత అల్లు అరవింద్ తో కలిపి బన్నీ జెండాను ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను గీతా ఆర్ట్స్ సంస్థ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. కేవలం కార్యాలయంలోనే కాకుండా బన్నీ తన నివాసంలో కూడా జాతీయ జెండాను ఎగురవేసినట్టు ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ మేరకు వారు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో బన్నీ భార్య స్నేహా రెడ్డి, కుమారుడు అయాన్, కుమార్తె అర్హ కూడా పాల్గొనడం విశేషం.