: బీహార్ లోని ఆ ఊర్లో మాత్రం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అర్థరాత్రి జరుగుతాయి!


యావద్భారత దేశం ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగస్టు 15న ఉదయం ఘనంగా నిర్వహించుకుంటే బీహార్ లోని పుర్నియాలోని జెండా చౌక్ ప్రాంతంలో మాత్రం రాత్రి 12.01 నిమిషానికి జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. ఇలా విభిన్నంగా ఎందుకు నిర్వహిస్తారు? అని ప్రశ్నించేవారికి 'సంప్రదాయం' అంటూ వారు సమాధానం చెబుతారు.

1947లో ఆంగ్లేయులు భారత్ కు స్వాతంత్ర్యం ఇచ్చినట్టు ప్రకటించగానే ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రామేశ్వర్‌ ప్రసాద్‌ పదివేల మంది స్థానికులతో పునర్నియాలో అర్థరాత్రి జెండా వందనం కార్యక్రమం చేపట్టారు. ఆ సంప్రదాయాన్ని ఆయన వారసులు పాటిస్తూ వచ్చారు. ఈ సంప్రదాయం ఇంత వరకు బ్రేక్ చేయలేదని వారు తెలిపారు. ఆయన మరణానంతరం ఆయన కుమార్తె సులేఖ, ఇప్పుడు ఆయన మనవడు విపుల్‌ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున స్థానికులు ఉత్సాహం చూపడం విశేషం. 

  • Loading...

More Telugu News