: సీనియర్ తమిళ సినీ నటుడు షణ్ముగ సుందరం కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు సుపరిచితుడైన సీనియర్ నటుడు షణ్ముగ సుందరం ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం చెన్నై, సాలిగ్రామంలోని ఇంట్లో కన్నుమూసినట్టు బంధువులు తెలిపారు. తమిళ నాటకాల్లో హిట్లర్ పాత్రకు పెట్టింది పేరైన ఆయన్ను సినీ పరిశ్రమకు శివాజీ గణేషన్ పరిచయం చేశారు. 1963లో 'రథ తిలగం'తో పరిచయమైన ఆయన, వందలాది చిత్రాల్లో నటించి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. శింబు హీరోగా రిలీజ్ అయిన 'అన్బనవన్ అసరధవన్ అదంగధవన్' (ఏఏఏ) ఆయన నటించిన చివరి చిత్రం. షణ్ముగ సుందరం మృతి పట్ల పలువురు తమిళ చిత్ర ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.