: చాలా అరుదుగా డ్రింక్ చేస్తాను!: హీరో సాయిధరమ్ తేజ్
తాను చాలా అరుదుగా మద్యం తాగుతానని, అది కూడా ఫ్రెండ్స్ తో కలసి ఇంట్లోనే తాగుతానని హీరో సాయిధరమ్ తేజ్ చెప్పాడు. హైదరాబాద్ లోని సెంట్రల్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ లోని ఓ బెటాలియన్ తో ఆయన ఈ రోజు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సాయి ధరమ్ తన దైన శైలిలో సమాధానమిచ్చాడు.
‘మీరు ఎప్పుడైనా డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డారా?’ అని ప్రశ్నించగా పైవిధంగా సాయిధరమ్ సమాధానమిచ్చాడు. రాంగ్ రూట్ లో వెళ్లి పట్టుబడ్డ సందర్భాలు కూడా చాలా తక్కువ అని, ఒకేఒక సారి రాంగ్ రూట్ లో వెళితే పోలీసులు ఆపారని అన్నాడు. అయితే, కౌన్సెలింగ్ ఇస్తామని సదరు పోలీస్ అధికారి అంటే, ‘సార్.. ఫైన్ కడతాను’ అని తాను చెప్పానని, ఈలోగా ఓ పోలీసు వచ్చి తాను ఫలానా అని చెప్పారని అన్నాడు. దీంతో, ‘ఫస్ట్ వార్నింగ్’ అని చెప్పి పంపించారంటూ సాయిధరమ్ చెప్పుకొచ్చాడు.