: ఆసుపత్రిలో వున్న మిత్రుడిని పరామర్శించిన చంద్రబాబు!
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తన మిత్రుడు మేకా వీర వెంకట సత్యవరప్రసాద్ ని సీఎం చంద్రబాబు పరామర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బి.కొండేపాడుకు చెందిన సత్యవరప్రసాద్ కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఉన్నత చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నిన్న ఆసుపత్రికి వెళ్లి వరప్రసాద్ ను పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులను, వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరింత మెరుగైన వైద్య సేవల నిమిత్తం వేరే ఆసుపత్రికి తరలించాల్సి వస్తే అందుకు అవసరమైన సాయం చేస్తానని ఈ సందర్భంగా సత్యవరప్రసాద్ కుటుంబసభ్యులకు చంద్రబాబు హామీ ఇచ్చారు.