: సంతోష జీవనానికి సాధనా రహస్యాలపై శిక్షణ ఇవ్వనున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’
సంతోషంగా జీవించాలంటే అనుసరించాల్సిన మార్గాలపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని సమన్వయకర్త దుర్గాజీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మానసిన ఒత్తిళ్లను అధిగమించి సంతోషంగా ఉండటానికి చేయాల్సిన సాధన రహస్యాలను రవిశంకర్ తెలియజేస్తారని చెప్పారు.
అయితే, దేశ వ్యాప్తంగా 2,100 ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ శిక్షణా కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్టు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో వంద ప్రాంతాల్లో ఈ సదుపాయం కల్పిస్తున్నామని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రాల వద్ద శిక్షకులు ఉండి సహకారం అందిస్తారని సమన్వయకర్త దుర్గాజీ ఓ ప్రకటనలో తెలిపారు.