: కొత్త పార్టీ పెట్టడం లేదు... స్ప‌ష్ట‌తనిచ్చిన గ‌ద్దర్!


ప్రజాగాయకుడు గద్దర్ కొత్త పార్టీ పెడ‌తార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని వార్త‌లు హల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆయ‌న పార్టీ పెడితే ఒంట‌రిగానే పోటీ చేస్తారా? అనే ప్ర‌శ్న‌ కూడా ఆయ‌న అభిమానుల్లో త‌లెత్తుతోంది. దీనిపై ఆయ‌న ఈ రోజు స్ప‌ష్ట‌తనిచ్చారు. ఈ రోజు సంగారెడ్డిలో నిర్వహించిన తెలంగాణ ప్రజా సామాజిక సంఘాల ఐక్య వేదిక ఆవిర్భావ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తాను కొత్త పార్టీ పెట్ట‌నున్నాన‌న్న వార్త‌ల‌ను కొట్టిపారేశారు. కొత్త పార్టీ పెట్టడం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ‌లో ప్ర‌జ‌ల‌ను, ప్రజా సంఘాలను ఐక్యం చేయడమే తన లక్ష్యమని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News