: పాకిస్థాన్ ప్రజలకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన రిషి కపూర్... ట్విట్టర్ లోకం మిశ్రమ స్పందన!
పాకిస్థాన్ గురించి తరచుగా ట్వీట్లు చేసే బాలీవుడ్ నటుడు రిషి కపూర్ తాజాగా మరో ట్వీట్ చేశాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన పాకిస్థాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన ట్వీట్‌పై ట్విట్టర్ లోకం నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈ పోస్ట్‌పై కొంతమంది నెటిజన్లు `ఇరు దేశాల మధ్య సౌభ్రాతృత్వం బలపరిచే ట్వీట్` అంటూ పొగడ్తలు కురిపించగా, మరికొంత మంది మాత్రం `ఉగ్రవాదుల దేశానికి శుభాకాంక్షలు చెబుతావా?` అంటూ మండిపడ్డారు. గతంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా పాకిస్థానీ ఆటగాళ్లను మెచ్చుకుంటూ ట్వీట్ చేసి రిషి కపూర్ తీవ్ర విమర్శల పాలయ్యారు.