: 'నా భార్య ఎక్కడ్రా?' అంటూ తుపాకీతో యలమంచిలి వైద్యాధికారిణి భర్త హల్ చల్!
నా భార్య ఎక్కడ్రా? అంటూ వైద్యాధికారిణి భర్త యలమంచిలి ప్రభుత్వాసుపత్రిలో తుపాకీతో హల్ చల్ చేసిన ఘటన కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళ్తే... విశాఖపట్టణం జిల్లా యలమంచిలి ప్రభుత్వాసుపత్రిలో వైద్యాధికారిణిగా పని చేస్తున్న శ్రీలక్ష్మితో ఆమె భర్త శ్రావణ్ కుమార్ రెడ్డికి విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో నేటి తెల్లవారు జామున తుపాకీ చేతపట్టుకుని ముగ్గురు రౌడీలతో కలిసి ఆసుపత్రికి చేరుకున్న శ్రావణ్ కుమార్ రెడ్డి... నా భార్య ఎక్కడ్రా? అంటూ వైద్యులు, సిబ్బందిని బెదిరించి, వీరంగమేశారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, రోగులు ఆందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.