: మరో బంపర్ ఆఫర్‌ ప్రకటించిన బీఎస్‌ఎన్ఎల్.. డేటా ఎంతైనా వాడుకోండి.. స్పీడ్ మాత్రం తగ్గదంతే!


మరో అద్భుతమైన ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ ముందుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డేటా ప్లాన్లకు భిన్నంగా సరికొత్త టారిఫ్ ప్లాన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న పోటీని తట్టుకునే ఉద్దేశంతో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.1099తో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ ప్రకటించింది. ఇందులో భాగంగా వినియోగదారులు స్పీడ్‌ లిమిట్ లేకుండా అపరిమితంగా డేటాను వినియోగించుకోవచ్చు. నెల రోజుల పాటు ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్వేచ్ఛగా డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి ప్లాన్లనే ఇతర కంపెనీలు ఆఫర్ చేస్తున్నా అందులో కొంత డేటా ఉపయోగం తర్వాత స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఆఫర్‌లో ఈ వేగం నిబంధన లేదు.

  • Loading...

More Telugu News