: జనం లేక ఆగిన జగన్ రోడ్ షో.. రెండున్నర గంటల ఎదురుచూపు!
ఉప ఎన్నిక సందర్భంగా నంద్యాలలో ఆదివారం రోడ్ షో నిర్వహించిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. జనం ఎవరూ ఆయన రోడ్ షోను పట్టించుకోకపోవడంతో రెండున్నర గంటలు ఆలస్యమైంది. నిజానికి రోడ్‌షో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అందులో భాగంగా స్థానిక శ్రీనివాస సర్కిల్‌లో జగన్ ప్రసంగించాల్సి ఉంది. అయితే అక్కడ జనాలు ఎవరూ లేకపోవడంతో జగన్ రోడ్‌షో ప్రారంభించలేదు. ఆ సమీపంలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే రామనాథ్‌రెడ్డి కుమారుడు, వైసీపీ నేత ప్రతాప్ రెడ్డి ఇంట్లో రెండున్నర గంటలపాటు నిరీక్షించారు. అనంతరం జనాలు ఒక్కొక్కరుగా రావడంతో 11:30 గంటల సమయలో జగన్ రోడ్ షో ప్రారంభించారు.