: అది జరిగితే.. చంద్రబాబుకు ‘అపర భగీరథుడు’ అనే బిరుదు ఇప్పిస్తా :కేవీపీ రామచంద్రరావు


2019 నాటికి పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీరందిస్తే కనుక చంద్రబాబుకు అపర భగీరథుడు అనే బిరుదు ఇప్పిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు. 2004కు ముందు పోలవరానికి అడ్డుపడింది చంద్రబాబే అని, ఈ ప్రాజెక్టు విషయంలో ఆయన చేసింది శూన్యమని విమర్శించారు. చంద్రబాబు తనకు ఉన్న ఆర్థికశాస్త్రంలో ప్రావీణ్యతను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగిస్తే మంచిదని, అబద్ధాలను అందంగా చెప్పగలిగే తెలివితేటలు ఆయన సొంతమంటూ కేవీపీ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నానని తనపై దుష్ప్రచారం చేయడం తగదని, ఆ ఆరోపణలు కనుక నిరూపిస్తే, రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని కేవీపీ సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News