: నంద్యాల ఉప ఎన్నికపై భన్వర్‌లాల్ కసరత్తు.. పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాల మోహరింపునకు ఆదేశం
నంద్యాల ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ దృష్టి సారించారు. ఉప ఎన్నిక ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులను ఆదేశించారు. చెక్‌పోస్టులు, రహదారులపై పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం.. విద్యుత్, టాయిలెట్లు, నీళ్ల సదుపాయం కల్పించాలన్నారు. ఓటర్ల జాబితాను పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇవ్వాలని, ఓటర్లకు స్లిప్‌లు అందించాలని ఆదేశించారు.