: శిల్పా అనుచరులు డబ్బు పంచుతూ దొరికారు: సోమిరెడ్డి
నంద్యాల ఉపఎన్నికలో బరిలో ఉన్న వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అనుచరులు డబ్బు పంచుతూ దొరికారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ విడుదల చేసింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, జగన్ ఉన్మాది కన్నా హీనంగా మాట్లాడుతున్నారని, చంద్రబాబును జగన్ లాంటి వాళ్లు ఏం చేయలేరని అన్నారు. జగన్ తనకు టీవీ, పత్రిక లేదనడం హాస్యాస్పదమని, రోజా చేసే వ్యాఖ్యలతో టీడీపీకే లాభమని, తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీని గెలిపిస్తాయని అన్నారు.