: ఈనెల 17 నుంచి ఆమరణ నిరాహారదీక్షకు దిగుతాను: జగ్గారెడ్డి ప్రకటన
సంగారెడ్డి మెడికల్ కాలేజీని సిద్ధిపేటకు తరలించి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 17 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ కోసం తాము ఉద్యమాలు చేసి, అరెస్టు కూడా అయ్యామని అన్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ సర్కారు నుంచి స్పందన రావడం లేదని అన్నారు. తమ ప్రాంతానికి ఆ కాలేజీని తేవడంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ విఫలమయ్యారని జగ్గారెడ్డి విమర్శించారు. సర్కారు తమ డిమాండ్ ను నెరవేర్చేవరకు తన పోరాటం ఆగదని తెలిపారు.