: సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న టీడీపీ కాపు నేతలు!


తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నేతలు ఎల్లుండి సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ కానున్నారు. హోం మంత్రి చినరాజప్ప నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో కాపు రిజర్వేషన్ల వ్యవహారంపై కీలకంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాపు కులస్తులకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, మంజునాథ కమిషన్ నివేదిక వీలైనంత త్వరగా వచ్చేలా చూడాలని చంద్రబాబును కాపు నేతలు కోరనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News