: అంత సులభంగా పగలని, నీటిలో పడినా తడవని ‘ఆర్మర్ 2’ స్మార్ట్ ఫోన్!
అంతసులభంగా పగలని, నీటిలో పడినా ఏమీ కాకుండా సురక్షితంగా ఉండే ‘ఆర్మర్ 2’ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను యూల్ ఫోన్ సంస్థ విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి లభ్యం కానున్న ఈ ఫోన్ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే..
* గ్లాస్ ఫైబర్, రీన్ ఫోర్సడ్ పాలీకార్బొనేట్, మెటల్ తో ఈ ఫోన్ ను రూపొందించారు
* - 40 డిగ్రీల నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పని చేసే సామర్థ్యం
* 5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* డ్యుయల్ సిమ్
* 4700 ఎంఎహెచ్ బ్యాటరీ
* 2.6 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* 6 జీబీ ర్యామ్, 64 స్టోరేజ్
* 256 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్
* ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కేవలం 0.1 సెకండ్ల సమయంలోనే అన్ లాక్ చేసుకునే సౌకర్యం
* 16 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్న ఈ ఫోన్ డార్క్ గ్రే, గోల్డ్ రంగుల్లో లభిస్తోంది. దీని ధర విషయానికి వస్తే రూ.17.300.