: ‘బిగ్ బాస్’ అనుభవం.. సంపూర్ణేష్ బాబు మెంటల్లీ సిక్ అయిపోయాడు: నటి జ్యోతి


‘బిగ్ బాస్’ షో నుంచి మొట్టమొదట ఎలిమినేట్ అయిన హీరో సంపూర్ణేష్ బాబు మెంటల్లీ సిక్ అయిపోయాడని ఆ షో నుంచి ఇటీవల ఎలిమినేట్ అయిన మరో ఆర్టిస్ట్ జ్యోతి చెప్పింది. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘‘బిగ్ బాస్’ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంపూర్ణేష్ బాబు తెగ బాధపడుతున్నారు. ఎలిమినేట్ కాకుండా ఉండి ఉంటే బాగుండేదని సంపూర్ణేష్ మొన్న అన్నారు. తనను పెద్ద హీరోగా ఫ్యాన్స్ భావిస్తున్నారని, ఎలిమినేట్ అయిన తర్వాత తనను తిడుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ లు వచ్చాయని సంపూ తమతో చెప్పారని ఆమె తెలిపారు.

సంపూర్ణేష్ బాబు ‘బిగ్ బాస్’ నుంచి వెళ్లిపోతారని అసలు అనుకోలేదు. సంపూర్ణేష్ బాబును కన్ఫెషన్ రూమ్ కు తీసుకువెళ్లినప్పుడు తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారాయన. దాంతో ఆయనకు ఎక్కడ హార్ట్ స్ట్రోక్ వస్తుందో అని ఒక టాబ్లెట్ ను నాలుక కింద పెట్టుకోమని ఇస్తే.. దానిని కూడా ఆయన పారేశారు. కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు రాగానే సంపూర్ణేష్ బాబు గెంతుతూ.. అందరూ కలిసి నన్ను ఎలిమినేట్ చేయండంటూ.. ఓ సైకోలా ప్రవర్తించారు. మేమంతా కిచెన్ లోకి వెళ్లి అక్కడ ఉండే నైఫ్ లన్నింటిని దాచేశాం. ఎందుకంటే, పరిస్థితి ఎట్లా ఉంటుందో అని! సంపూర్ణేష్ బాబు బెడ్ రూమ్ లో పడుకునే వారు కాదు. గార్డెన్ లో పడుకునేవారు! కింద ఓ బెడ్ షీట్ వేసుకుని పడుకుని, ఆకాశం వైపు చూస్తూ పడుకునేవారు. 'ఇదేంటిరా బాబు! ‘బిగ్ బాస్’లో పాల్గొంటే ఇంత ఒత్తిడితో ఇట్లా అయిపోతారా! నేను కూడా ఇలానే అయిపోతానా! అనిపించింది. లక్కీలీ వన్ వీక్ లోనే నేను కూడా ఎలిమినేట్ అయిపోయాను’ అని జ్యోతి చెప్పింది.

  • Loading...

More Telugu News