: ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య భార‌త్‌, చైనా సైన్యాధికారుల స‌మావేశం... చ‌ర్చ‌లు విఫ‌లం!


భారత్‌,  చైనా స‌రిహ‌ద్దులోని డోక్లాం ప్రాంతంలో 50 రోజుల‌కి పైగా ఏర్ప‌డిన ఉద్రిక్తత‌ల‌తో పాటు ఇత‌ర అంశాల‌పై చ‌ర్చించేందుకు ఇరు దేశాల సైన్యాలు నిర్వహించిన పతాక సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఈ స‌మావేశాన్ని సిక్కింలోని నాగుల వద్ద నిర్వ‌హించారు. ఇందులో భార‌త్‌, చైనాకు చెందిన‌ మేజర్‌, జనరల్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా డోక్లాం ఉద్రిక్తత‌ల‌పై చర్చించారు. ఆ ప్రాంతం నుంచి రెండు దేశాలకు చెందిన సైన్యాలు డోక్లాం నుంచి ఒకేసారి వెనక్కి మళ్లాలని భారత అధికారులు సూచించారు. అయితే, చైనా పాత పాటే పాడింది. భారత్ సైన్యం వెంట‌నే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని తెలిపింది. దీంతో ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసింది.  

  • Loading...

More Telugu News