: 7 అంతస్తుల మీద నుంచి కిందపడి.. ధ్వంసమైన బీఎండబ్ల్యూ కారు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ బహుళ అంతస్తుల భవనంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఏడవ అంతస్తులో ఉన్న పార్కింగ్ గేరేజ్ నుంచి బీఎండబ్ల్యూ కారును తీస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి కిందకు పడిపోయింది. ఆ కారును నడిపిస్తోన్న మహిళా డ్రైవర్ కి గాయాలు కాగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను అక్కడి పోలీసులు విడుదల చేశారు. పై నుంచి ఆ కారు కిందపడిన సమయంలో అక్కడ మరో కారు ఉంది. ఆ కారు అదే సమయంలో కాస్త ముందుకు జరిగింది. దీంతో ఆ కారుకి ఏమీ కాకపోయినా, పైనుంచి పడిన బీఎండబ్ల్యూ కారు మాత్రం పాడైంది.