: నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకే బీజేపీ మద్దతు


నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీకే తమ మద్దతని ఏపీ బీజేపీ ప్రకటించింది. ఈ రోజు విజయవాడలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమ మద్దతు టీడీపీకే అంటూ బీజేపీ నేతలు అధికారికంగా ప్రకటించారు. నంద్యాల ఉప ఎన్నికే కాకుండా... కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీతో కలిసే పని చేయాలని నిర్ణయించారు. రేపట్నుంచి టీడీపీతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని బీజేపీ నేతలు తెలిపారు.  

  • Loading...

More Telugu News