: కొంతమంది హీరోయిన్లను చూస్తుంటే బాధేస్తుంది: శ్రుతిహాసన్
ముభావంగా ఉంటూ, ఎవరితోనూ కలవకుండా సైలెంట్ గా ఉండిపోయే హీరోయిన్లను చూస్తుంటే తనకు బాధేస్తోందని శ్రుతిహాసన్ చెబుతోంది. జీవితం చాలా చిన్నదని, అందివచ్చే ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ గడపాలని చెప్పిన ఈ సౌత్ సినిమా బ్యూటీ, సైలెంట్ గా ఉన్న సహ హీరోయిన్లతో మాటలు కలపడంలో తనకెంతో ఆనందం లభిస్తుందని చెప్పుకొచ్చింది.
మంచి జరిగితే పొంగిపోవడం, చెడు జరిగితే కుంగిపోవడం తనకు నచ్చదని, ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకేలా ఉంటూ, చుట్టూ ఉన్న వారితో కలసిపోవడమే తనకు ఇష్టమని అంటోంది. ఆనందంగా జీవిస్తూ, కొత్తవారిని కలుస్తూ, గలగలా మాట్లాడుతూ ఉండటం తన నైజమని, అలా చేయలేకుంటే, పరిశ్రమలో ఉండలేనని కూడా అనిపిస్తుంటుందని అంది. కాగా, శ్రుతి ప్రస్తుతం తన తండ్రి నటిస్తున్న 'శభాష్ నాయుడు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.