: సెప్టెంబర్ లో సెకండ్ పార్ట్: డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల విచారణపై అకున్ సబర్వాల్!
కలకలం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల విచారణకు సంబంధించి తొలి భాగం పూర్తయిందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. సెప్టెంబర్ లో రెండో జాబితా ఉంటుందని చెప్పిన ఆయన ప్రస్తుతానికి సినీ ఇండస్ట్రీకి సంబంధించి విచారణ ముగిసినట్టేనన్న సంకేతాలు ఇచ్చారు.
తాము స్వేచ్ఛగా విచారిస్తున్నామని పేర్కొన్న ఆయన, తొలి ఎపిసోడ్ గ్లామర్ పార్ట్ విచారణ పూర్తయిందని తెలిపారు. ఇప్పటివరకూ 11 కేసులు నమోదయ్యాయని, వాటిపై త్వరలో చార్జ్ షీట్ వేయనున్నామని అకున్ సబర్వాల్ తెలిపారు. కాగా, ఈ కేసులో ఇద్దరు సినీ ప్రముఖులకు వ్యతిరేకంగా పూర్తి సాక్ష్యాధారాలు లభించినట్టు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.