: షూటింగ్ లో గాయపడ్డ అమితాబ్.. విశ్రాంతి వద్దంటున్న బిగ్ బీ!


‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ షూటింగ్ సమయంలోబాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ గాయపడ్డట్టు సమాచారం. ఆయన పక్కటెముకకి గాయమైంది. అయినప్పటికీ, బిగ్ బీ విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య మాట్లాడుతూ, అమితాబ్ గాయపడటంతో చాలా బాధపడ్డానని, షూటింగ్ వాయిదా వేద్దామని చెప్పామని, అయినా, బిగ్ బీ షూటింగ్ లో పాల్గొన్నారని అన్నారు. వృత్తిపట్ల అమితాబ్ కు ఉన్న అంకితభావం, ప్రేమకు ఈ సంఘటనే నిదర్శనమంటూ విజయ్ కృష్ణ ఆచార్య ఉబ్బితబ్బిబ్బయ్యారు.

  • Loading...

More Telugu News