: తిరుపతి రైల్వే స్టేషన్ ముందు ఆర్టీసీ బస్సు... మహిళా కండక్టర్ పై ఆటో, టాక్సీ డ్రైవర్ల దాడి


పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు చేరుకునే యాత్రికుల ప్రధాన రవాణా మార్గంగా ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భక్తులను ఎక్కించుకునేందుకు ఓ ఆర్టీసీ బస్సును ఆపగా, తమ బేరాలు పోతున్నాయని ఆరోపించిన టాక్సీ, ఆటో డ్రైవర్లు మహిళా కండక్టరుపై దాడికి దిగడం కలకలం రేపింది. ఈ ఉదయం ఆ బస్సు రైల్వే స్టేషన్ మీదుగా వెళుతూ, ప్రధాన గేటు ముందుకు వచ్చి ఆగింది. ఆ పక్కనే ఉన్న పలువురు ప్రైవేటు వాహనాల డ్రైవర్లు దాడికి దిగారు. దాడి ఘటనపై తూర్పు పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు, అసలేం జరిగిందన్న విషయమై సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News